ఇసుక రవాణా చేసే వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరిగా కప్పాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇసుక రవాణా సమయంలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాలు అనుమతులు పొందిన జీసీకేసీ, ప్రతిమ సంస్థలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే విధించాల్సిన జరిమానా, రవాణా చేయాల్సిన సమయాలపై జులై 21న తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa