ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని IMD అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.