సార్వత్రిక ఎన్నికల వేళ షోపియాన్, అనంత్‌నార్లో జరిగిన ఉగ్రదాడులపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఈ ఉగ్రదాడులపై అంతర్జాతీయ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదం ఆగిపోయే వరకు పొరుగు దేశం పాకిస్తాన్‌తో ఎటువంటి చర్చలు ఉండబోవని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగే వరకు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.