శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ రెవిన్యూ డివిజన్లోని పలు మండలాలలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి. రొద్దం మండలంలో 10. 2 మిల్లీమీటర్లు, పరిగి 16. 4, పెనుకొండ 14. 8, సోమందేపల్లి 24. 4, హిందూపురం 6. 4, లేపాక్షి 32. 8, చిలమత్తూరు 10. 6, అమరాపురం 39. 8, రోళ్ల 11. 6 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. మొత్తం వర్షపాతం 167. 0మిల్లీమీటర్లు కాగా సగటు వర్షపాతం 13. 9 మిల్లీమీటర్లు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.