శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సిపిఎం కాలనీలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతినిఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, కెవిపిఎస్ నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఆయన పోరాటాలను కొనియాడారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa