బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వర్ణలోని శివాలయం సమీపానికి చెందిన ఉదయగిరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తండ్రి శ్రీనివాసరావు ఉన్నారు. ఆ సమయంలో బంధువులై ఉదయగిరి నాగరాజు, ఉదయగిరి శేషయ్య, అమ్మిశెట్టి నవీన్, అమ్మిశెట్టి వెంకటరావుతో స్థలం సరిహద్దుల విషయంలో వివాదాలు జరిగాయి. ఇటీవల ఎన్నికల సమయంలో గతంలో ఉన్న గొడవలను మనసులో పెట్టుకున్న నాగరాజు, శేషయ్య, నవీన్, వెంకటరావు ఆదివారం ఉదయం తండ్రీకొడుకులపై దాడికి తెగబడ్డారు. తల, శరీరంపై తీవ్ర గాయాలైన ఇద్దరినీ కుటుంబ సభ్యులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అవుట్ పోస్ట్ పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.