పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కోరింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్‌రెడ్డిలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈసీ ఆదేశాల మేరకు ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ వినీత్‌ను కలిశారు. ఈ సందర్భంగా సిట్ చీఫ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతో పాటు అల్లర్లకు కారణమైన కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.