చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు అని మంత్రి జోగి రమేష్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ప్రజల మద్దతు లేకపోవడంతో కూటమిగా వచ్చి ఎదుర్కోలేక విధ్వంసం సృష్టించారు. కొన్ని మూకల్ని ప్రేరేపించి దాడులకు పాల్పడ్డారు. అరాచకాలు చేసి దౌర్జన్యాలు చేసి దుర్మార్గ చర్యలకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. తెలుగుదేశం పార్టీ నిర్వాకంతో ఈ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చలా మిగిలాయి. ప్రజాభిమానం నిండుగా ఉన్న వైయస్ జగన్పై గెలవలేక హింసను ప్రేరేపించారు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.