టీడీపీ నేతలు, బీసీలు, దళితులు, మైనార్టీలను ఎన్నికలలో ఓటు వేయలేదని గ్రామాల నుంచి తరిమేశారు అని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విధ్వంసం సృష్టించి లబ్ధి పొందాలని చూసింది. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నిందితులుపై చర్యలు ఉండాలని డిమాండ్ చేసారు.