కర్నూలు స్థానిక గణేష్‌నగర్ ఆటోనగర్ సమీపంలో నివాసం ఉంటున్న చాకలి రాము (35) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డెమాను గ్రామానికి చెందిన రాము భార్య ఎల్లమ్మతో కలిసి బతుకుదెరువు కోసం కర్నూలు వచ్చారు. చాకలి పని చేసుకుంటూ జీవనం చేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం కూడా మద్యం తాగడానికి వెళ్తండగా.. భార్య మందలించి పనికి వెళ్లిపోయింది. పని ముగించుకుని ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్మాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.