సీజనల్ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీహెచసీ నాగేశ సూచించారు. పుట్టపర్తి మండలంలోని కోట్లపల్లి, రాచువారిపల్లి గ్రామాల్లో ప్రజల కు సోమవారం ఆయన సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే క్షయ నివారణకు అడల్డ్ బీసీజీ వ్యాక్సిన వేయించుకోవాలని తెలిపారు. ఈ వ్యాక్సిన వేయించుకుంటే క్షయ పూర్తిగా నయమవుతుందని చెప్పారు. ముఖ్యంగా క్షయ వచ్చి తగ్గిపోయిన వారు, అరవై ఏళ్ల వయసు నిండిన వారు ఈ వ్యాక్సిన వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ వెంకటరమణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.