రెంటచింతల మండలంలోని రెండు గ్రామాలలో ఈనెల 13న నిర్వహించిన పోలింగ్ సందర్భంగా బూత్‌లలోని ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఎస్ఐ ఎం. ఆంజనేయులు తెలిపారు. తుమృకోట గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీకి చెందిన పలువురుని, జెట్టి పాలెం గ్రామంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి వైసీపీకి చెందిన వారిని అరెస్టు చేశామని తెలిపారు.