లింగాల మండలం వెలిదండ్ల పంచాయతీ పరిధిలో ప్రాచీనకాలంలో వెలసిన వరదరాజ స్వామి వారి ఆలయంలో గురువారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు బుధవారం నిర్వాహకులు తెలిపారు. మొలకల పౌర్ణమిని పురస్కరించుకుని ఈకార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులవ్వాలని కోరారు.