నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం నాడు మొహిని ఉత్సవం, అఖండ జ్యోతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలవర్లకు పూలంగి సేవ కార్యక్రమాలు ప్రధాన అర్చకులు భాస్కరా చార్యులు ఆద్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కనుల పండుగగా సాగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.