ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఈవీఎంలు ధ్యంసమైన పాలువాయిగేట్ గ్రామంలోని 202 పోలింగ్ బూత్ తుమృకోటలోని 205, 206, 207 పోలింగ్ బూత్‌లను పరిశీలించి జరిగిన ఘటనలను అడిగి తెలుసుకున్నారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి పలు సూచనలు చేశారు. తుమృకోట, రెంటాల గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆమె వెంట ఆర్మ్‌డ్ డీఎస్పీ వెంకటేశ్వరరరావు, సీఐ నారాయణస్వామి, ఎస్‌ఐ ఎం.ఆంజనేయులు తదితరులున్నారు. తుమృకోటలో ఎస్పీ ఉన్నప్పుడే ఈ వ్యవహారంపై ఓ పోలీసు అధికారి ధ్వంసం జరిగిన తీరును వివరించారు. అంతేగాకుండా మాచర్లలో ఓ మహిళా కౌన్సిలర్ భర్త ఫిర్యాదు చేయడంతో యంత్రాంగం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.