ఏసీబీ వలలో ఓ పెద్ద అవినీతి చేప చిక్కింది. ఓ ఐస్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం రూ. 2.50 లక్షలు లంచం ఇస్తేనే కానీ పని చేయనంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మురళీ ఇబ్బందులకు గురి చేయడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోనికి దిగిన రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పథకం ప్రకారం వలపన్ని రూ. 2 లక్షలు లంచం తీసుకుని కారు డిక్కీలో పెడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా జీఎం మురళీని పట్టుకున్నారు.