వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలోఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గులేకుండా కాకి డ్రెస్ వేసుకుని అమ్ముడు పోయారని దుయ్యబట్టారు. సకల పాపాల భైరవుడు డీజీపీ, పోలీసులు ఒకవైపు పూర్తిగా మోకరిల్లటం వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. హోమ్ మినిస్టర్ ఎవరో కూడా కనీసం తెలియదని, కానిస్టేబుల్ కూడా లెక్క చేయని పరిస్థితి అని, ఈ ఖ్యాతి మొత్తం సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు.