సత్తెనపల్లి నియోజకవర్గంలోని వివిధ బూత్‌లలో వెబ్ కెమెరా ఫుటేజ్‌లు, తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించి ఆయా పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అక్కడి వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు మరో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి రాంబాబు తరఫున న్యాయవాది వీఎన్ఆర్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. కానీ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది.