టీడీపీ ముఖ్య నేత బుద్దా వెంకన్న కీలక కామెంట్స్ చేశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలన్నారు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో కూటమికే ప్రజలు పట్టం కట్టారని.. 130 స్థానాల్లో విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పాటు.. లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి.. నలుగురు నాలుగు దిక్కులుగా పార్టీ కోసం పని చేశారని అన్నారు. గత ఎన్నికల్లో 23 సీట్లు టీడీపీకి వస్తే.. పార్టీ పని అయిపోయందని, పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని బుద్దా గుర్తు చేశారు. ఈ ఐదేళ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందన్నారు. వారికి అండగా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు.