ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయ దురుద్దేశాలతో వివాదాలు సృష్టించే వ్యక్తుల పై కఠిన చర్యలు తప్పవని ఆమదాలవలస ఎస్‌ఐ కె.వెంకటేష్ హెచ్చరించారు. గురువారం ఆమదాలవలస మున్సిపాలిటీ 14వ వార్డు ఐజీ నాయుడు కాలనీలో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్, పోలీస్ ప్లాగ్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహిం చగా ఎటువంటి పత్రాలు లేని మూడు వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. అనంతరం ఎస్‌ఐ వెంకటేష్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన చిన్నపాటి మన స్పర్థలను మరిచిపోయి ఎప్పటిలాగానే ఐకమత్యంగా ఉండాలన్నారు. కొంతమంది కావాలనే రాజకీయ లబ్ధి కోసం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని అటు వంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.