రేపల్లె పరిధిలోని గ్రామదేవత అయిన వుయ్యూరువారి ఇలవేల్పు కొలుపుల సందర్బంగా నగరం మండలం వుయ్యూరువారిపాలెం నుంచి రేపల్లె మండలం మోర్తోట ముక్తేశ్వరస్వామి దేవాలయాని కి నాలుగు ట్రాక్టర్లు, ఆరు ఆటోలతో తరలివెళ్ళారు. మోర్తోట కృష్ణానది ఒడ్డున వుయ్యూరమ్మ తల్లి కొలుపులు శుక్రవారం మధ్యాహ్నం వరకు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం మండలంలోని కామరాజుగడ్డ నార్త్ సమీపంలో ఆటోను తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకుని వెళ్ళింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న 30 మందిలో 18 మందికి గాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరం తా కొల్లిపర మండలం దావులూరిపాలెం గ్రామస్తులు. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించగా ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గా యాలైన దావులూరివారిపాలేనికి చెందిన వుయ్యూ రు సాంబశివరావు, వుయ్యూరు వెంకటేశ్వరరావు, వుయ్యూరు భవాని, మల్లేశ్వరమ్మ, శివయ్య, మరో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం తెనాలి, గుం టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మిగ తా వారికి చిన్న గాయాలు కావటంతో రేపల్లె ప్రభు త్వ వైద్యశాలలోనే డాక్టర్లు వైద్యసేవలు అందించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు రాలేదని చెప్పారు.