ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ఏపి పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని తప్పుపట్టారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు. పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.