విజయనగరం జిల్లా, బొండపల్లి మండలంలోని అంబటివలస, గొట్లాం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఓ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలం, గుంకలాం గ్రామానికి చెందిన తాడ్డి తాత బాబు(35) అదే మండలంలోని కొండకరకాం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకని అంబటివలస నుంచి ద్విచక్రవా హనంపై ఇంటికి వెళ్తుండగా విజయనగరం నుంచి వస్తున్న వ్యాను బ లంగా ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో తాతబాబు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సంతోషి, మూడేళ్ల వయస్సున్న కుమార్తె అను ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.