సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్ర క్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో విజయనగరం నగరంలోని టూటౌన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వైఎస్సార్ నగర్‌లో విజయనగరం డీ ఎస్పీ గోవిందరావు పర్యవేక్షణలో సీఐ కోరాడ రామారావు, ఎస్‌ఐలు దు ర్గాప్రసాద్, రాజేష్, సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి, రికార్డులు సక్రమంగా లేని వాహనా లు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు ప్రతి ఇంటి పరిసరాలను విస్తృతంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించి వారు ఎవరి ఇంటికి వచ్చింది? ఏ పని మీద వచ్చింది? అన్న విషయాలను ఆరా తీశారు. వాహన రికార్డులు సక్రమంగా లేని 31 మోటారు సైకిళ్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రామారావు మాట్లాడుతూ, టూటౌన్ పరిధిలో విస్తృతం గా తనిఖీలు చేపడతామని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పి స్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు పత్రాలు తప్ప నిసరని, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే.. స్థానికులు సమాచారం అందించాలన్నారు. కార్డన్ సె ర్చ్‌లో పట్టుబడ్డ వాహనాలు, వాహనాల యాజమానులు వారి, వారి వాహన ప త్రాలను తీసుకువస్తే, పరిశీలించిన అనంతరం విడుదల చేస్తామన్నారు. కార్యక్ర మంలో ఏఎస్‌ఐ పైడితల్లి, పోలీసులు పాల్గొన్నారు.
![]() |
![]() |