ఇసుక రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు ఏఎస్పీ టి.విఠలేశ్వర్, ఆర్డీవో హేలాషారోన్ తెలిపారు. కొల్లూరు మండల పరిధిలోని పెదలంక, పెసర్లంక అరవింద వారధి, గాజుల్లంక, జువ్వలపాలెం ప్రాంతాల్లో నదిలోని గాలు మార్గాల వద్ద మండల అధికారులు తీసుకున్న చర్యలను ఆదివారం వారు పరిశీలించారు. గత వారంలో కలెక్టర్ రంజిత్‌బాషా రీచ్‌లను పరిశీలించి అనధికారిక తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించి గండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు ఆయా మార్గాల్లో తవ్విన గండ్లను పరిశీలించారు. ఇతర మార్గాల నుంచి సైతం ఇసుక అక్రమ రవాణా జరగకుండా క్షేత్రస్థాయిలో వీఆర్వోలు నిఘా ఉంచాలని ఏఎస్పీ, ఆర్డీవోలు సూచించారు. పరిశీలనలో మైనింగ్ ఏడీ రాజేష్‌కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ పుల్లారావు, ఆర్‌ఐ త్రివేణి తదితరులు ఉన్నారు.
![]() |
![]() |