అరసవల్లి జనసేన క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటిం చారు. ఈసందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆశయాలు, లక్ష్యల సాధనకు పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని ప్రతి జ్ఞ చేయించారు. పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన జన సేన నాయకులు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా పార్టీ జిల్లాఅధ్యక్షుడిగా పిసిని చంద్రమోహన్, ఉపాధ్యక్షులుగా గర్భాన సత్తి బాబు, పాత్రుని పాపారావు, భూపతి అర్జున్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యద ర్శులుగా డాక్టర్ దానేటి శ్రీధర్, సంతోష్‌పండా, కూరాకుల యాదవ్,కోళ్ల జైరామ్, యూపీ రాజు, లోల్ల రాజేష్, కార్యదర్శులుగా 15 మంది, సంయుక్త కార్యద ర్శులుగా మరో 15 మంది బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొగిరి సురేష్‌బాబు పాల్గొన్నారు.
![]() |
![]() |