రాయదుర్గం మండలం చదం, గొల్లల దొడ్డి గ్రామాల్లో సోమవారం సీఐ శ్రీనివాసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని రౌడీషీటర్లు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![]() |
![]() |