ఎర్రగుంట్ల పరిధిలోని జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య, తహశీల్దార్ సౌజన్య లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు మందకోడిగా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు వచ్చిన బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేలా సచివాలయం పరిధిలోని అమినిటీస్ వారికి తెలియజేయాలని తెలిపారు.