ఒంటిమిట్టలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలను కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. గజ్జల నరసింహారెడ్డి, ఎస్వీ రమణ, బొబ్బిలి రాయుడు, వీరాంజనేయరెడ్డి, నామాల వెంకటయ్య, డీలర్ రామసుబ్బారెడ్డి, సాదు శ్రీనివాసులు, ఎంపీటీసీ భాష టిడిపి నేతలు పాల్గొన్నారు.