మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ దార్శనికత గల గొప్ప నాయకుడని, తెలుగువారందరికీ ఆయన గర్వకారణమన్నారు. సినీ రంగంలో ఎనలేని సేవలు చేసి మకుఠం లేని మహారాజుగా వెలిగారని కీర్తించారు. ప్రజా సమస్యలు చూసి రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రజా సేవకు అంకితమయ్యారన్నారు. ఆయన పరిపాలన దక్షత నేటి తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు.