ఓ ఐదేళ్ల బాలికపై 24 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కా కుండా ఉండాలంటే ఆ కామాందుడికి శిక్ష పడాలంటూ ఆ గ్రామ యువకులు బయట ప్రపంచానికి తెలియజేశారు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. కొందరు గ్రామస్థుల వివరాల మేరకు.. ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసు కుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఆదివారం రాత్రి ఆ మహిళ కూతురు ఆడు కుంటుండగా... ఓ యువకుడు మద్యం మత్తులో మామిడి పండు ఇస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుం బీకులు ఆ పరిసరాల్లో వెతికారు. కాసేపటికి ఆ చిన్నారి ఇంటికి రావడంతో ఎక్కడికి వెళ్లావంటూ తల్లి అడగడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లి ఘటనను కుటుంబసభ్యులతో పాటు బంధువులకు చెప్పడంతో ఆ యువకుడిని పి లిచి దేహశుద్ధి చేశారు. విషయం బయటపడితే యువకుడిపై కేసు తప్పదని గ్రహిం చి చిన్నారి కుటుంబంపై కొందరు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ గ్రామానికి చెందిన కొందరు యువకులు ఘటన గురించి మీడియాకు తెలియజేయడంతో విషయం బటపడింది. దీంతో ఆ యువకుడిని కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పంపించేశారు. పొందూరు ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా.. ఈ ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఫిర్యాదు అందలేదన్నారు. సుమోటాగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa