ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. డెమో రైళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్, ఇతర నిర్వహణ పనులు కారణంగా పది రోజులుగా డెమో రైళ్లు రద్దు చేశారు.. ఆ పనులు పూర్తికావడంతో ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, విజయవాడ, గుంటూరు నుంచి నడిచే అన్ని రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు గతంలో షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని అధికారులు తెలిపారు. అటు నరసాపురం, భీమవరం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి.. షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి.
మరోవైపు గుంటూరు వెళ్లే పాస్ట్ ప్యాసింజర్ మాత్రం ప్రారంభంకాలేదు. ఈ నెల 31 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. నరసాపురం నుంచి ఉదయం 9.45కి విజయవాడ, అలాగే మధ్యాహ్నం 2.45కి గుంటూరు, మధ్యాహ్నం 3.05కి విజయవాడ, రాత్రి 8.10కి నిడదవోలు, రాత్రి 11.10కి భీమవరం వెళ్లే డెమా రైళ్లు కూడా షెడ్యూల్ మేరకు నడవనున్నాయి. ఈ డెమో రైళ్లు పది రోజులుగా రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు వెలవెలబోయాయి. కొందరు ప్రయాణికులు గుంటూరు పాస్ట్ ప్యాసింజర్ రైలు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఈ రైలు రద్దు చేయడంతో ఉదయం సమయంలో గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa