టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామా రావు జయంతి వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కార్యా లయంలో అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహానుభా వుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని, బడుగు, బలహీన, మైనార్టీ, దళిత, గిరిజన వర్గాల కోసం తన ఊపిరి వున్నంత వరకూ తపన పడ్డ పేదల పక్షపాతి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రత్తిపాడు అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగు జాతి భూమిపై ఉన్నంత కాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టు కుని ఉంటారన్నారు. పశ్చిమ ఇనచార్జి కోవెలమూడి రవీంద్ర మాట్లా డుతూ దేశంలోనే మొదటిసారి పేదవారి సంక్షేమం గురించి ఆలోచిం చిన మానవతావాది, పేదల శాశ్వత బంధువు అన్న ఎన్టీఆర్ అని కొని యాడారు. నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని నేషనల్ ఫ్రంటును స్థాపించి పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషించి ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాస్, నేతలు గుంటుపల్లి నాగేశ్వరరావు, మానుకొండ శివప్రసాద్, కసుకుర్తి హనుమంతరావు, కంచర్ల శివరామయ్య, జంపని హనుమంతరావు, దామచర్ల శ్రీనివాసరావు, పానకాల వెంకట మహాలక్ష్మి, కొత్తూరి వెంకట్, బొబ్బిలి రామారావు, రావిపాటి సాయికృష్ణ, మన్నవ వంశీ, వేములకొండ శ్రీనివాస్, శోభారాణి, కొల్లి అనీల్, పోతరాజు సమత, యర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాకారులను సన్మానించారు.