యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. తుని రూరల్ సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారిపై కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద ఈ నెల 18న ఓ యువతి మృతదేహం కనిపించింది. సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికవీఆర్వో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 37 సంవత్సరాల నందిగం ప్రవీణ్ ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లింగాల కాలనీలో ప్రవీణ్ అద్దెకు ఉంటూ డెక్కన్ ఫ్యాక్టరీలో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. విచ్చలవిడి తనంగా ఉండడం, మితిమీరిన కోరికలతో ప్రవీణ్ చెడుదారులు పట్టాడు. భార్య ఇంటిలో లేని సమయాల్లో వ్యభిచార వృత్తితో ఉన్న యువతిని ఇంటికి తీసుకురావడం పరిపాటిగా మారింది. అయితే ఈ నెల 18న భార్య ఇంట్లో లేకపోవడంతో తుని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఒక లాడ్జి వద్ద వ్యభిచార వృత్తిలో ఉన్న కొర్రా కుమారి(28)ని మాట్లాడుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకెళ్లాడు. మితీమిరిన కోరికలతో ఆమెను ఇబ్బందులకు గురి చేయడంతో అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో పక్క ఇళ్ల వారికి విషయం తెలిసిపోతుందనే భయంతో ప్రవీణ్ యువతిని విచక్షణా రహితంగా కొట్టి మద్యం మత్తులో గొంతు నులిమి చంపేశాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని ప్లాస్టర్‌తో కట్టి బ్లాక్ సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి స్కూటర్ మధ్య పెట్టుకుని పాయకరావుపేట హైవే, తుని, జగన్నాథగిరి, బి.కొత్తూరు కూడలి మీదుగా రాజుల కొత్తూరు వద్ద వెంకటాపురం గ్రావెల్ రోడ్డులో పడేసినట్లు సీఐ తెలిపారు. అయితే సాంకేతికతో పరిజ్ఞానంతో నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని స్కూటర్‌తో పాటుగా సూట్‌కేస్‌ను స్వాధీన పరుచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును పర్యవేక్షించిన పెద్దాపురం డీఎస్పీ కె.లతాకుమారి, తుని రూరల్ సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి, ఎస్‌ఐ బి.రమేష్, కోటనందూరు ఎస్‌ఐ బి.శంకర్రావు, తుని పట్టణ ఎస్‌ఐ జె.విజయ్‌బాబు, కోరంగి ఎస్‌ఐ రవికుమార్, కానిస్టేబుల్స్ మణికంఠ. శివ, రాంబాబు, పామురాజు, కిరణ్, భరత్, నాయుడు, శ్రీను, అప్పారావు, సత్యనారాయణ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.