సౌత్ సెంట్రల్ రైల్వే విజయ వాడ డివిజన్ పరిధిలోని గన్నవరం నుంచి నూజివీడు వరకు 21.21 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఆధునికీ కరణ చేయబడిందని విజయ వాడ రైల్వే అధికారులు తెలి పారు. గన్నవరం – నూజివీడు రైల్వే స్టేషన్ల మధ్యలో పెద్దవుటపల్లి, తేలప్రోలు రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. అధునాత ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. డివిజన్ రైల్వే నెట్‌వర్క్‌లో భద్రత, సామర్ధ్యాన్ని పెంపొందించడం లక్ష్యమన్నారు. అత్యంత రద్దీగా ఉండే గన్నవరం – నూజివీడు సెక్షన్‌లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విజయవాడ డివిజన్‌కు చెందిన గతి శక్తి బృందం 31.81 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 12 నెలల్లో పనులు పూర్తి చేశారన్నారు. భారతీయ రైల్వేలో ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్) వ్యవస్థ అనేది రైల్వే సిగ్నలింగ్ పద్ధతి, రైల్వే లైన్ల వరుస ట్రాక్ విభాగాలు లేదా బ్లాక్‌లుగా విభజిస్తుందన్నారు. ఆటోమెటిక్ సిగ్నల్ ఉపయోగించి ఈ బ్లాక్‌ల మధ్య రైళ్ళ కదలికలను నియంత్రి స్తుందన్నారు. ఏబీఎస్ ఆపరేషన్ రైళ్ళు స్వయం చాలకంగా పనిచేయడానికి అనుమతిస్తుందన్నారు. భద్రత, వేగ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. ఈ ఆధునీకకరణ ఏబీఎస్ పనులు విజయవాడ డివిజన్ మొత్తంలో 58.91 కిలోమీటర్ల పొడవున అమర్చడం జరిగిందన్నారు. ఇటీవల నిడదవోలు – కొవ్వూరు మధ్య ఏర్పాటు చేసిన ఏబీఎస్‌తోనే రైళ్ళ రాకపోకలు ఏప్రిల్ 24లోనే ప్రారంభించారన్నారు.