కష్టపడి పనిచేసేవారు అన్యాయానికి గురవుతున్నారని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తవలస పరిధిలోని ఉత్తరాపల్లి గ్రామంలోని చెరువులో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులను కలసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు . ఉత్తేజభరితమైన పాటలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో కేటాయించే నిధులలో కోత విధించారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు, కూలీలకు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. వీరు లేక పోతే జీవనం సాగుతుందా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడు గాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.