ఎన్నికల ప్రక్రియలో అంతిమ ఘట్టానికి చేరుకున్నాం. ఇప్పటివరకు సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిపాం. అదే స్ఫూర్తితో జూన్ 4న నిర్వహించే కౌంటింగ్ లోనూ సమన్వయంతో పనిచేద్దాం. సజావుగా కౌటింగ్‌ను పూర్తి చేద్దాం.’’ అని కౌంటింగ్ సిబ్బందికి జగ్గయ్యపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె.వెంక టేశ్వర్లు సూచించారు. జగ్గయ్యపేట మునిసిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు, మార్గదర్శకాలను ఆయన చేశారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది, అధికారులు వ్యక్తిగత భావావేశాలను ప్రదర్శించకూడ దన్నారు. సర్వీసు ఓటర్ల లెక్కింపు అనంతరం పోస్టల్ బ్యాలెట్ల లెక్కించాలని, పోస్టల్ బ్యాలెట్ల వ్యాలిడిటీపై ఏజెంట్లు ఎంత ఒత్తిడి చేసినా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆయన సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో 4 టేబుల్స్ వద్ద నలుగురు ఏఈఆర్వోలు పర్యవేక్షిస్తారని, నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య ప్రకారం తొలి రౌండ్‌లో ఒక్కొక్క టేబుల్ వద్ద 500 ఓట్లు, రెండో రౌండ్‌లో100 చొప్పున లెక్కిం చాలన్నారు. 25 బ్యాలెట్లను ఒక కట్టగా కట్టాలని సూచించారు. 14 టేబుళ్లు, 16 రౌండ్లలో 222 ఈవీఎంలను లెక్కించాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు యూనిట్లు సవ్యంగా వచ్చాయా లేదా అని స్ట్రాంగ్‌రూం వద్ద సరిచూసుకోవాలని ఆయన సూచిం చారు. నియోజకవర్గంలో 57, 212 పోలింగ్ బూత్‌లలో ఈవీ ఎంలు మొరాయించటం వల్ల ప్రత్యామ్నాయంగా వేరే ఈవీ ఎంలు ఏర్పాటు చేశామని, ఆ రౌండ్లలో రెండు ఈవీఎంలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏ దశలో, ప్రక్రి యలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సంతకాలు మర్చిపోవద్దని ఆదేశించారు. సీసీ టీవీ నిఘా ఉంటుందని, ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఉద్యోగులు ఎవ రెవరికి ఓటు వేశారో బహిరంగపరచొద్దని ఆయన హెచ్చ రిం చారు. మీడియా సెంటర్‌కు, కౌంటింగ్ హాలు నుంచి సమా చారం ఇచ్చేందుకు ఇద్దరిని నియమించామని తెలిపారు. అసెంబ్లీ కౌంటింగ్‌కు పూర్తి బాధ్యతలు జగ్గయ్యపేట తహసీ ల్దార్ జీవీ శేషుదని, పార్లమెంట్ కౌంటింగ్ పూర్తి బాధ్యత తన దని చెప్పారు. రిటర్నింగ్ అధికారికి కౌంటింగ్ సహాయకులు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఏఈఆర్వోలు పలు సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa