వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రాథమిక సాక్షాలు చాలా కీలకమని సీనియర్ ఐపీఎస్ అఅధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ అనంతరం ఇవాళ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు భూతద్దంలో అక్కడంతా వెదకాలని... అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని సూచించానన్నారు. అయినా ఆనాడు పూర్తి ఆధారాలు సేకరించ లేదన్నారు. మా కింద సిబ్బందికి విచారణలో సూచనలు చేయడం సహజ ప్రక్రియ అని.. ఇప్పటికీ ఆ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది కాబట్టి పూర్తి గా మాట్లాకూడదన్నారు. 23 మంది వైసిపి ఎమ్మెల్యే లు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదన్నారు. అది రాజకీయ కోణంలో జరిగిన ప్రక్రియ అని... తనకేంటి సంబంధమని ప్రశ్నించారు. పార్టీ మార్పు పై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా అప్పుడు స్పందించారని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. వివిధ కారణాలతో వస్తే... తాను ఎలా తీసుకొచ్చినట్లని ప్రశ్నించారు. ఎవరో ఒకరిని బకరా చేయాలని తనపై నింద వేశారని తెలిపారు. 2019 తరువాత పరిపాలన విధానంలో స్పష్టమైన మార్పు కనిపించిందని తెలిపారు. తన విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. తన తప్పు ఉంటే సారీ చెప్పి, శిక్ష కు కూడా సిద్దం అయ్యే వాడినన్నారు. తనకు వచ్చిన ఇబ్బందిపై చేయని తప్పుకు పోరాటం చేయాలని భావించానని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికీ న్యాయస్థానంలో తన పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. పోరాటంలో తనకు లక్షల మంది మానసికంగా అండగా నిలిచారన్నారు. వారు ఇచ్చిన ధైర్యం తనలో మనోస్థైర్యం నింపిందన్నారు. పోరాడే కొద్దీ ఇంకా కొత్త కొత్త కేసులు పెట్టారని ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.