పొగాకు వినియోగానికి అందరూ దూరంగా వుంటూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని బి.కొత్తకోట సీహెచ్‌సీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ పేర్కొన్నారు. శక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. మరో వైద్యాధికారి హసీనాపర్వీన్ మాట్లాడుతూ పొగాకును ఏ రూపంలో తీసుకున్నా శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ ఫల్మన రీడిసీజ్, క్షయ లాంటి ప్రమాదకర ప్రసరణ వ్యాధులు సోకుతాయన్నా రు. మెదడులో రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుందని, గొంతుక్యాన్సర్, గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. తాగే వారి కి మాత్రమే కాకుండా పీల్చేవారికి కూడా ప్రమాదమని ప్రతి ఒక్కరూ పొగాకు ప్రమాదం పై అప్రమత్తంగా వుండాలని కోరారు. ఆస్పత్రి లో అందుబాటులో ఉన్నవారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.