ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుందని, కనుక ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ సూచించారు. ధర్మవరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్ రోజు ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమర పాటుగా వ్యవహించరాదన్నారు. సత్యకుమార్ యాదవ్ తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సత్యకుమార్ గెలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జింకాచంద్రశేఖర్, సాకే ఓబుళేశు, నాయకులు బొట్టుశ్రీనివాసులు, నరసింహులు, యువమోర్చా జిల్లాకార్యదర్శి కార్తీక్, నాయకులు గరువు వెంగప్ప, ఆదినారాయణ, మైనార్టీ నాయకులు నబీరసూల్ తదితరులు పాల్గొన్నారు.