ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:14 PM

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధి కృష్ణాపురం సమీపంలో లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా, నాలుగేళ్ల బాలుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించి పట్టణ ఎస్‌ఐ సుధాకరరావు తెలిపిన వివరాలివి. మునిసిపాలిటీ శివారు కళ్ళెంపూడి గ్రామానికి చెందిన కళ్ళెంపూడి వీరబాబు తన తమ్ముడు కుమారుడైన నాలుగేళ్ల మదన్‌కుమార్‌తో బైక్‌పై ఆదివారం నర్సీపట్నం వచ్చాడు. పని ముగించుకొని స్వగ్రామం కళ్ళెంపూడి బయల్దేరగా, కృష్ణాపురం వద్ద తుని వైపు నుంచి వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొంది. వీరబాబుకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు మదన్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa