ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠ్యపుస్తకాలను పరిశీలించిన అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:16 PM

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తామని ధర్మవరం ఎంఈఓ-2 గోపాల్‌ నాయక్‌ తెలిపారు. ధర్మవరం పట్ట ణంలోని ఎమ్మార్పీకి చేరిన పుస్తకాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పాఠ శాలలు పునఃప్రారంభ మవుతాయన్నారు. ఇప్పటికి 1 నుంచి 7వ తరగతి వరకు 21వేల పాఠ్యపుస్తకాలు ఎమ్మార్సీకి వచ్చాయన్నారు. వీటిని ఆయా పాఠశాలలకు పంపుతామన్నారు. సోమవారం 8,9,10వ తరగతుల పుస్తకాలు రానున్నట్టు చెప్పారు. 2024-25 విద్యాసంవత్సరంలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు పట్టణంలోని గుట్టకిందపల్లి మోడల్‌స్కూల్‌కు, మండలంలోని మోటుమర్ల వద్దగల కేజీబీవీకి అనమతులు వచ్చినట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa