ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటక పరిషత్‌ కృషి ఎనలేనిది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:21 PM

కనుమరుగవుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించడానికి నాటక పరిషత్‌లు చేస్తున్న కృషి ఎనలేనిదని పలువురు వక్తలు అన్నారు. చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో భీమవరంలోని డీఎన్‌ఆర్‌ ఇంగ్లీష్‌ మీడియ స్కూల్‌ ఆవరణంలో జరుగుతున్న 17వ జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలలో నాలుగో రోజు ఆదివారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. ముందుగా ఈ నాటిక పోటీలను మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్‌ కారుమురి సత్యనారాయణ, సూర్యమిత్ర చైర్మన్‌ ఇర్రింకి సూర్యరావు, సీనియర్‌ న్యాయవాది తాడిమళ్ల గిరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆజో,విభో,కందాళం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి ఎం.రత్నకుమారికి పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆనంతరం ప్రదర్శించిన రెండు నాటికలు ఆహుతులను కళా ప్రియులను అలరించాయి. నాటక పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షులు రాయప్రోలు భగవాన్‌, రాయప్రోలు శ్రీనివాసముర్తి, భట్టిప్రోలు శ్రీనివాస్‌, బోండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణవర్మ, కట్రేడ్డి సత్యనారాయణ, వడుపు గోపి పాల్గొన్నారు. నాటికల న్యాయ నిర్ణేతలుగా మనాపురం సత్యనారాయణ, పంపన ధనంబాబు, డాక్టర్‌ ఎన్‌వీ కృష్ణారావు వ్యవహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa