ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యతోనే ఉన్నతస్థానాలకి ఎదగవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:34 PM

విద్యతోనే పేదరికాన్ని జయించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 2023-24 సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అనంతపురం జిల్లా వాల్మీకి-బోయ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఆదివారం స్థానిక రామ్‌ నగర్‌ సమీపంలోని వాల్మీకి కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానోత్సవం నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణలతో కలిసి ఆ పురస్కారాలు అందజేసిన కాలవ మాట్లాడారు. వాల్మీకి బోయలు విద్యలో ఉన్నత స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్రాంత డీఎఫ్‌ఓ ఆదినారాయణ, జీసీడీఓ వాణిదేవి, అమరావతి ఆసుపత్రి ఎండీ ముత్యాలప్ప, మాజీ సీఈఓ ఈశ్వరయ్య, ఆనందరామ, వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అక్కు లప్ప, చైతన్యకుమార్‌, కోశాధికారి పవనకుమార్‌, నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa