ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు భారీ విరాళం అందింది. అమరావతిలోని ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ భారీ విరాళం అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసిన మన్నవ మోహనకృష్ణ.. చంద్రబాబుకు రూ.2 కోట్ల విరాళం తాలుకూ చెక్కును అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్టు చాలా సేవా కార్యక్రమాలు చేస్తోందని.. అవి నచ్చే మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో తన వంతుగా విరాళం ఇచ్చినట్లు మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మరోవైపు మన్నవ మోహనకృష్ణ గత కొన్నేళ్లుగా టీడీపీలో పనిచేస్తున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మన్నవ మోహనకృష్ణ.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున గుంటూరు వెస్ట్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే టికెట్ మాత్రం పిడుగురాళ్ల మాధవికి దక్కింది. వైసీపీ నేత, మంత్రి విడదల రజినీకి పోటిగా పిడుగురాళ్ల మాధవిని బరిలో నిలిపింది టీడీపీ అధిష్టానం. ఇదే సమయంలో మన్నవ మోహనకృష్ణ అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు.. మన్నవ మోహనకృష్ణను పిలిపించి మరీ సర్దిచెప్పారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీకి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని నచ్చజెప్పారు. అలాగే పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా మేయర్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.
అధినేత నుంచి కీలక హామీ లభించడంతో మన్నవ మోహనకృష్ణ ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆమె విజయానికి కృషి చేశారు. ఎన్నికలు పూర్తై.. మంగళవారం ఫలితాలు వెల్లడికానున్న తరుణంలో .. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి.. ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు విరాళం అందించారు మన్నవ మోహనకృష్ణ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa