ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డామన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని.. నిబంధనలు ఉల్లంఘన కాకుండా చూసుకోవాలన్నారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి బయటకు రావొద్దని చంద్రబాబు సూచించారు. కంట్రోల్ యూనిట్ నంబర్ ప్రకారం సీల్‌ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను... కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలన్నారు. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దన్నారు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa