రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరి స్వల్ప అధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా చాలా రౌండ్లు లెక్కించాల్సినప్పటికీ మొదట్లో ఉన్న ట్రెండ్ చివరి వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పిఠాపురం, అమలాపురం, రాజోలు, గన్నవరం, పెద్దాపురం నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అధిక్యాన్ని కనబరుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa