జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ ఎన్నికల వేళ అందరి దృష్టి పిఠాపురంపై పడింది. పవన్ కళ్యాణ్‌కు పోటీగా.. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని.. కాపు సామాజికవర్గానికే చెందిన వంగా గీతను బరిలోకి దింపింది. అంతే కాదు.. ఎన్నికల ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లిన జగన్.. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురం పోరు ఆసక్తికరంగా మారింది. పవన్ ఎంట్రీతో 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో 86.63 శాతం పోలింగ్ నమోదైంది.
వాస్తవానికి పిఠాపురం సీటుపై టీడీపీ నేత వర్మ ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వర్మ ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందని ఆయన ధీమాతో ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సైడ్ అవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ విస్తృతంగా ప్రచారం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa