మంగళవారం వైసీపీ బ్యాడ్ డే. ఉదయం నుంచి టీడీపీ మానియా కొనసాగింది. పది గంటలకే కూటమి సునామీ సృష్టించింది. ఏ దశలోనూ వైసీపీ నేతలు సత్తా చాటుకోలేకపోయారు. ముఖ్యంగా విశాఖలో కచ్చితంగా గెలుస్తామన్న నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. దీంతో విశాఖ వైసీపీ క్యాడర్లో నిస్తేజం అలుముకుంది. ఊహించని ఫలితాలు వస్తుండడంతో ఎవరూ ఇంట్లో నుంచి బయటకురాని పరిస్థితి ఉంది.
విశాఖ నార్త్, దక్షిణం, పశ్చిమ నియోజకవర్గాల్లో ఈసారి పక్కాగా వైసీపీ జెండా ఎగురుతుందని గట్టిగా నమ్మారు. కానీ ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.