పుస్తకాల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబావలి హిందూపురం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టికను పాఠశాలలో వేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.